దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారిని గురువారం ఎస్పీ మహేష్ బి. గీతే దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోకి రాగానే ఎస్పీకి అర్చక స్వాములు, వేద పండితులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం తర్వాత స్వామి వారి కల్యాణ మండపంలో వారిని అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. వారి వెంట టౌన్ సీఐ వీరప్రసాద్, ఆలయ అధికారులు, సిబ్బంది ఉన్నారు.