వేములవాడ: లాడ్జిలో యువకుడి అనుమానాస్పద మృతి

వేములవాడ పట్టణంలోని జాతర గ్రౌండ్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ లాడ్జిలో గుర్తు తెలియని యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. యువకుడి మృతికి కారణం హత్యనా లేక ఆత్మహత్యనా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్