దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీపార్వతి రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం సాధారణ భక్తుల రద్దీ దర్శనమిస్తుంది. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తుడు లేకుండానే కనిపిస్తున్నాయి. వచ్చిన భక్తజనం ముందుగా ధర్మ గుండంలో స్నానాలు ఆచరించిన తర్వాత, కోడె మొక్కులతో పాటు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు తక్కువగా ఉండడంతో స్వామివారి దర్శనం బాగా జరిగిందని భక్తులు పేర్కొన్నారు.