వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారిని ఆదివారం పరకాల ఎమ్మెల్యే రేగురి ప్రకాష్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా అర్చక స్వాములు స్వాగతం పలికారు. స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. నాగిరెడ్డి మండపంలో వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రజలందరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.