రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని ఫాజుల్ నగర్ గ్రామంలో మండల పరిషత్ నిధుల ద్వారా ప్రాథమిక విద్యాలయంలో డైనింగ్ హాల్ కి మాజీ వైస్ ఎంపీపీ జక్కుల కవిత భూమి పూజ చేశారు. ఆమె మాట్లాడుతూ తిరుపతి స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం సమయంలో ఇబ్బంది పడుతున్న సందర్భంగా విద్యార్థులకు డైనింగ్ హాల్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ ఎంపీటీసీగా గెలిచిన తర్వాత గ్రామంలో అనేక కార్యక్రమాలు చేసినట్లు చెప్పారు.