వివాహమైన నెలకే యువకుడు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండలంలోని వెంకట్రాయిని చెరువులో మునిగి భూక్యా ప్రశాంత్ (25) అనే యువకుడు మృతి చెందాడు. ఐదుగురు అక్కల తర్వాత పుట్టిన ఏకైక కుమారుడైన ప్రశాంత్, ఏడేళ్ల క్రితం తండ్రిని విద్యుత్ ఘాతంతో కోల్పోయాడు. ఇటీవల మే 13న వివాహం జరిగిన ప్రశాంత్, పెళ్లైన నెల రోజులకే మృతి చెందడంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. స్థానికులు ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్