కర్ణాటక మంత్రి నాగేంద్ర రాజీనామా (వీడియో)

కర్ణాటక రాష్ట్ర ప్రణాళిక, గణాంకాల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నాగేంద్ర తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం బెంగళూరులో మీడియా సమావేశంలో నిర్ణయాన్ని ప్రకటిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. వాల్మీకి ఎస్టీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో రూ.89 కోట్ల అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ఒత్తిడి పెరిగింది. ఆగస్టు 3న ఆయన మళ్లీ కేబినెట్‌లోకి వచ్చారు. తనను దళితుడిననే కారణంతో టార్గెట్ చేస్తున్నారని నాగేంద్ర ఆరోపించారు. ప్రభుత్వానికి మరింత ఇబ్బంది కలగకూడదనే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్

✕
✕