భారతీయ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపావళి తర్వాత ప్రారంభమయ్యే ఈ మాసం శివకేశవులకు ప్రీతిపాత్రమైనది. ఈ నెలలో వచ్చే సోమవారాలు, చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి రోజులు అత్యంత పవిత్రమైనవి. స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాసాలు, దీపారాధన, వనభోజనాలు చేయడం వల్ల పాపాలు తొలగిపోయి, పుణ్యం లభిస్తుందని విశ్వసిస్తారు. శివాలయాల్లో పితృదేవతల కోసం ఆకాశదీపాన్ని వెలిగిస్తారు. కార్తీకమాస వ్రతం ఆచరించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.