‘RX 100’ ఫేమ్ నటుడు కార్తికేయ గుమ్మకొండ గత రెండేళ్లుగా తెరపై కనిపించలేదు. చివరగా 2024లో ‘భజే వాయు వేగం’ సినిమాలో నటించిన ఆయన, ఇప్పుడు తన స్వీయ దర్శకత్వంలో ‘కమ్ బ్యాక్’ అనే కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాను తన కొత్త బ్యానర్ 'కార్తికేయ క్రియేటివ్ వర్క్స్' ద్వారా నిర్మిస్తున్నారు, భార్య లోహితా రెడ్డి నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఇది ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. సోమవారం టైటిల్ టీజర్ విడుదల చేశారు.