నేటి నుండి డిసెంబర్ 8 వరకు కార్తీక మాసం కొనసాగుతుంది. ఈ మాసంలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ఉపనయనాలు సహా పలు శుభకార్యాలకు అనుకూలమైన ముహూర్తాలు అందుబాటులో ఉన్నాయి. నవంబర్లో 12, 13, 14, 15, 16, 18, 20, 21, 22, 25, 26, 27 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు తెలిపారు. అలాగే డిసెంబర్లో 3, 4, 10, 14, 16, 19, 20, 23, 24, 25, 30 తేదీల్లో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు. మంచి ముహూర్తాలు ఉండటంతో శుభకార్యాలకు ప్రజలు సిద్ధమవుతున్నారు.