కరూర్ తొక్కిసలాట ఘటన.. ఎఫ్‌ఐఆర్ దాఖలు

ప్రముఖ తమిళ నటుడు, టీవీకే అధినేత విజయ్‌పై కరూర్ ర్యాలీ తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసు ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తన రాజకీయ శక్తి ప్రదర్శనకే ఆలస్యంగా సభకు హాజరై ప్రజల్లో ఉత్సుకత పెంచారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. టీవీకే 10వేలమంది మాత్రమే వస్తారని అనుమతి తీసుకోగా, భారీగా గుమికూడడం తొక్కిసలాటకు దారి తీసిందని పోలీసులు తెలిపారు. విజయ్ ప్రయాణిస్తున్న బస్సు షెడ్యూల్​లోని అనేక స్టాప్​ల వద్ద ఆగింది. నిజానికి ఇలా రోడ్​షో చేయడానికి అనుమతి తీసుకోలేదని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్