అసెంబ్లీ తీరుపై గద్దర్ పాటతో కవిత సెటైర్లు (వీడియో)

TG: రాష్ట్రంలో తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల తీరుపై TRS చీఫ్ కల్వకుంట్ల కవిత గద్దర్ పాట రూపంలో విమర్శలు గుప్పించారు. కొడంగల్‌లో జరిగిన సభలో ‘భలేగుందిరో మన అసెంబ్లీ’ అని పాడుతూ, రాజకీయాలంటే కేవలం ఒకరినొకరు బూతులు తిట్టుకోవడమేనా అని నిలదీశారు. ప్రజల మద్దతు ఉంటే కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరి విధానంపైనా ధైర్యంగా పోరాడుతానని ఆమె స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕