TG: రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందన్న కవిత వ్యాఖ్యలను ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజా పాలన నడుస్తోందని, ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వంపై కవిత అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కవిత సొంత తండ్రిని రోబో అని అనడం తగదని, తల్లిదండ్రులను గౌరవించుకోవాలని హితవు పలికారు. అలాగే సీఎం రేవంత్ రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారని కొనియాడారు.