HCA అవకతవకల వెనుక కవిత హస్తం కూడా ఉందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి విమర్శించారు. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుకు, ఎమ్మెల్సీ కవితకు దగ్గర సంబంధాలు ఉన్నాయని గురువారెడ్డి ఆరోపించారు. కవితపై కూడా సీఐడీ, ఈడీ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. కాగా ఐపీఎల్ టికెట్ల వివాదంలో HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు సహా పలువురిని సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.