'టీఆర్ఎస్' పేరుతో కవిత కొత్త పార్టీ.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెల 25న కొత్త పార్టీని అనౌన్స్ చేయబోతున్నట్లు కవిత ఇప్పటికే ప్రకటించగా ఆమె పార్టీ పేరుపై చర్చ మొదలైంది. అయితే కవిత కొత్త పార్టీ పేరును 'తెలంగాణ ప్రజా జాగృతి' అని పెట్టబోతున్నట్లు ఇప్పటివరకు ప్రచారం జరుగగా.. తాజాగా కేసీఆర్ వదిలేసిన 'టీఆర్ఎస్' పేరు పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో పాత ఉద్యమ పార్టీ పేరుతో కొత్త రాజకీయ అజెండాతో కవిత చేయబోయే పాలిటిక్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత పోస్ట్