హైకోర్టును ఆశ్రయించనున్న కవిత!

TG: 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కొరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత చేపట్టనున్న 72 గంటల నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దాంతో హైకోర్టును ఆశ్రయించాలని కవిత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థలు, విద్య మరియు ఉద్యోగాలలో బీసీ రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 4 నుండి 7 వరకు, హైదరాబాద్‌‌లోని ఇందిరా పార్క్ వద్ద 72 గంటల నిరాహార దీక్ష చేస్తానని కవిత తాజాగా ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్