తమిళ చిత్రం 'డ్రాగన్' తో పాపులర్ అయిన కయాదు లోహార్, తెలుగులోనూ అవకాశాలు అందుకుంటోంది. ఇటీవల విడుదలైన 'ఫంకీ'లో విశ్వక్ సేన్‍కు జోడీగా నటించినా, ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. ప్రస్తుతం నాని నటిస్తున్న 'ది ప్యారడైజ్' లో నటిస్తోంది. తాజాగా ఆమె నటించిన ఓ మలయాళ చిత్రం తెలుగులో విడుదలవుతుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా తెలుగు సినిమాల ఫలితాల గురించి తనకు బాధపడే తీరిక లేదని, తాను నా వంతు ప్రయత్నం చేశానని, కానీ అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయని పేర్కొంది.