TG: ఈ ఎన్నికలో రౌడీలు పొరపాటున గెలిస్తే పరిస్థితి ఎలా ఉంటదో అర్థం చేసుకోవాని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 'ఓట్లేయకుంటే బెదిరిస్తాడంటా, లేదంటే దొంగ ఓట్లు వేస్తాడంటా, డబ్బులతో ఓట్లను కొంటాడంటా.. ఇవన్నీ మనం చూసినవే. ఇంకొక 500 రోజుల్లో KCR ప్రభుత్వం రాబోతోంది. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీతానే గెలుస్తుంది' అని ధీమా వ్యక్తం చేశారు.