TG: మున్సిపల్ ఎన్నికలు ఉన్నందుకు రైతుబంధు(రైతుభరోసా) వెయ్యలేనని రేవంత్ రెడ్డి అంటున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. 'కరోనా సమయంలో కూడా కేసీఆర్ రైతుబంధు ఆపలేదు. రైతుబంధు డబ్బులు వేయడానికి మేము అభ్యంతరం తెలపకుండా ఎన్నికల సంఘంకు లేఖ రాస్తాం. ఎగగొట్టిన రెండు రైతుబంధులు, ఇప్పటిది కలిపి మూడు రైతుబంధులు ఇప్పుడే వేయండి' అని డిమాండ్ చేశారు.