TG: మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి హైదరాబాద్ నందినగర్‌కు బయలుదేరారు. నందినగర్ నివాసానికి చేరుకుని కేటీఆర్, హరీశ్ రావు, ఇతర నేతలతో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ విచారణపై చర్చించనున్నారు. ఇక కేసీఆర్ మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణకు హాజరవుతారు. కాగా కేసీఆర్ వెంట పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్తున్నారు.