ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. వచ్చే నెలలో కరీంనగర్‌లో జరిగే బీసీ సభపై, కాళేశ్వరం ప్రాజెక్టు తుది నివేదికపై చర్చిస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తాజా తీర్పు, బీసీ బిల్లుకు సంబంధించి రాష్ట్రపతిని కలిసే అంశంపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.