ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం.. మున్సిపల్ ఎన్నికలపై కీలక చర్చ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముగిసిన అనంతరం కేసీఆర్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 10 రోజుల్లో రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై చర్చించి, వారికి దిశా నిర్దేశం చేశారు. గ్రౌండ్ లెవల్లో పార్టీ బలంగా ఉందని, బరిలో రెబల్స్ లేకుండా చూసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ బలోపేతమవుతుందని, త్వరలోనే పార్టీలో చాలామంది చేరుతారని తెలిపారు. ఈ సమావేశం అనంతరం నందినగర్ నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి కేసీఆర్ బయల్దేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్