TG: మాజీమంత్రి హరీశ్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఈ రోజు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన తన సోదరి లక్ష్మీ భర్త కావడంతో మాజీ సీఎం కేసీఆర్ హరీశ్ రావు ఇంటికి వెళ్లారు. సత్యనారాయయణ పార్థివ దేహానికి కేసీఆర్ నివాళి అర్పించారు. శోకసంద్రంలో మునిగిన హరీశ్ రావును హత్తుకొని ఓదార్చారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకి రాగా.. ఆయన చాలా బలహీనంగా కనిపించారు.