ముఖ్య నేతలకు కేసీఆర్ పిలుపు

తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం పూర్తవడంతో ప్రచారం ఊపందుకోనుంది. ఈ నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు జారీ చేయడం సంచలనం సృష్టించింది. కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, మున్సిపల్ ఎన్నికల కారణంగా మరో రోజు నిర్ణయించాలని ఆయన కోరారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో, బీఫాంలు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. విచారణను తన ఎర్రవల్లి నివాసంలో జరపాలని, భవిష్యత్ నోటీసులను అక్కడికే పంపాలని సూచించారు.

సంబంధిత పోస్ట్