తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిపోసా.. కేసీఆర్ భావోద్వేగం

TG: నందినగర్ నివాసంలో రెండో అంతస్తులో KCRను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే మధ్యాహ్న భోజన సమయంలో కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. 'తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిపోసా. ఉద్యమ రచన చేసిన గదిలోనే విచారణ ఎదురుకోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. రాష్ట్ర సాధన కోసం ఇదే గదిలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. ఈ గదిలోనే ఎంతో మందితో చర్చలు జరిపా. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వ్యూహ రచన చేశా. ఇప్పుడు ఇదే గదిలో విచారణ ఎదుర్కోవడం దురదృష్టకరం' అని కేసీఆర్‌ తెలిపారు.

సంబంధిత పోస్ట్