బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా 'చిల్లర మాటలు' మాట్లాడుతున్నారని, బూతులకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ కుటుంబమేనని విమర్శించారు. గూగుల్‌లో బూతుల నాయకుడెవరని వెతికితే కేసీఆర్ పేరే వస్తుందని, కేటీఆర్ తన తండ్రి భాషను యూట్యూబ్‌లో చూసుకోవాలని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి 'దొంగల ముఠా'కు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు.