TG: మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాగునీరు, సాగునీరు, కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై ప్రజల్లోకి వెళ్లేందుకు BRS అధినేత కేసీఆర్ త్వరలో పాదయాత్ర లేదా ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్ 2026లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ స్వయంగా మాట్లాడుతూ.. నీళ్ల కోసం, ప్రజా సమస్యలపై త్వరలో పాదయాత్ర చేస్తానని కీలక ప్రకటన చేశారు. దాదాపు లక్ష మందితో కలిసి పాదయాత్ర నిర్వహించే ఆలోచనలో అధినేత ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.