కేసీఆర్ నిజాలు చెప్పాలి.. MLA డిమాండ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులపై ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించారు. కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చే అధికారం సిట్‌కు ఉందని, విచారణలో వచ్చిన విషయాల ఆధారంగానే ఈ నోటీసులు జారీ అయ్యాయని ఆయన అన్నారు. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్థం కావడం లేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌తో కేసీఆర్ తన రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టారని, ఆయన సిట్ ముందు హాజరై విచారణకు సహకరించి నిజాలు చెప్పాలని కోరారు.

సంబంధిత పోస్ట్