TG: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం మరోసారి వైద్య పరీక్షలకు యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు. అస్వస్థతకు గురై చికిత్స తీసుకుని గత శనివారం నుంచి నందీనగర్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన ఇవాళ చెకప్ కోసం ఆస్పత్రికి రానున్నారు. కాగా ఐదు రోజులుగా పార్టీ నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. 'స్థానిక' ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఎప్పటికప్పుడు సమాయత్తం చేయాలని దిశానిర్దేశం చేశారు.