ఈ నెల 9న పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్న కేసీఆర్

TG: బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 9న నల్లబెల్లికి వెళ్తున్నారు. ఇటీవల మరణించిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. నల్లబెల్లి మండల కేంద్రంలోని పెద్ది నివాసంలో ఆయన భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులతో భేటీ కానున్నారు. అదే రోజు నల్లబెల్లిలో జరిగే సంస్మరణ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్