TG: మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ విరుచుకుపడ్డారు. మంగళవారం రైతు ఆశిర్వాద సభలో మాట్లాడుతూ.. 'ప్రజలు పదేళ్లు భరించారు. చివరికి గొలుసులతో బంధించి పశుపతి లాగా ఫామ్‌హౌస్‌లో ఉంచారు. ఇప్పుడు పిల్ల రాక్షసుడు వచ్చాడు. అగ్రికల్చర్, హార్టికల్చర్.. అన్నింటినీ నాశనం చేశారు. కేవలం తాగుడు కల్చర్ తెచ్చిపెట్టారు. నాడు రైతు బజార్లు తెరిస్తే.. ఆయన బెల్ట్ బజార్లు పెట్టడం తప్పా చేసింది ఏమీ లేదు' అని మండిపడ్డారు.