సిట్‌ విచారణకు కేసీఆర్‌ హాజరవుతారు: కౌశిక్‌రెడ్డి

తెలంగాణ తెచ్చిన హీరో కేసీఆర్‌ అని, ఇలాంటి వాటికి కేసీఆర్‌ భయపడరని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు.  సిట్‌ విచారణకు కేసీఆర్‌ హాజరవుతారని చెప్పారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 'స్పీకర్‌ విచారణకు దానం రాలేదు. బీజేపీ కూడా విచారణకు హాజరుకాలేదు. కాంగ్రెస్‌, బీజేపీ ముందే ములాఖత్‌ అయ్యాయి. ఫిబ్రవరి 18న మళ్లీ రమ్మన్నారు. కరీంనగర్‌ సీపీ, జమ్మికుంట సీఐపై.. ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చాం. నా ఊరిలో సమ్మక్క దర్శనానికి వెళ్తే అడ్డుకున్నారు. అధికారులను వదిలే ప్రసక్తే లేదు' అని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్