TG: హైదరాబాద్ అంబర్పేటలో బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి హడావిడి మరో ఏడాదేనని, ఆ తర్వాత కేసీఆరే సీఎం అవుతారన్నారని ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలకమయ్యే రోజులు వస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలు దేశంలో కీలకం అవుతాయని జోస్యం చెప్పారు.