TG: మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారం క్రితం పాలమూరు జిల్లా ప్రాజెక్టుల గురించి కేసీఆర్ మాట్లాడుతూ.. పాలమూరు జిల్లా ప్రాజెక్టుల కోసం యుద్ధం చేస్తానని వ్యాఖ్యానించారని అన్నారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చకు ఆహ్వానించినా, ఆ అవకాశాన్ని వదిలేసి మైక్ కట్ చేసి వాకౌట్ చేయడం సరికాదని తెలిపారు.