కేదార్‌నాథ్ యాత్ర.. 1882 నాటి అరుదైన ఫొటోను పంచుకున్న ఆనంద్ మహీంద్రా

ఈ ఏడాది కేదార్‌నాథ్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిమాలయాల్లో కొలువైన కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు శీతాకాలం తర్వాత తెరుచుకోవడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా 1882 నాటి కేదార్‌నాథ్ ఆలయానికి సంబంధించిన అరుదైన ఫోటోను పంచుకున్నారు. ఆ రోజుల్లో రోడ్లు, రైలు మార్గాలు, హెలికాప్టర్లు లేకపోయినా, యాత్రికులు అపారమైన సమయం, సహనం, దృఢమైన విశ్వాసంతో యాత్ర చేసేవారని ఆయన గుర్తుచేశారు.

సంబంధిత పోస్ట్