ఓటర్ల జాబితాపై కన్నేయండి: సజ్జల రామకృష్ణా రెడ్డి

AP: వైసీపీ నేతలతో జూమ్ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రత్యర్థి పార్టీలు ఓట్లు తొలగించే అవకాశం ఉన్నందున, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, క్షేత్రస్థాయిలో పార్టీ కమిటీలను బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. నిరంతర పర్యవేక్షణతోనే ఎన్నికల్లో విజయం సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్