కస్టమర్ల ఫిర్యాదుల కోసం QR కోడ్‌ కనిపించేలా ఉంచండి: FSSAI

అన్ని ఫుడ్‌ బిజినెస్‌ ఆపరేటర్లకు FSSAI కొత్త ఆదేశాలు జారీ చేసింది. తమ లైసెన్స్‌/రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌తో పాటు ఫుడ్ సేఫ్టీ మొబైల్‌ యాప్‌ క్యూఆర్ కోడ్‌ను వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించింది. ప్రవేశ ద్వారాలు, బిల్లింగ్‌ కౌంటర్లు, కూర్చునే ప్రదేశాల్లో వీటిని ఉంచాలి. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల్లోనూ లింక్‌ ఇవ్వాలి. ఈ QR కోడ్‌ ద్వారా కస్టమర్ల ఫిర్యాదు చేయవచ్చు.

సంబంధిత పోస్ట్