కేరళలోని కొచ్చి కంటైనర్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడటాన్ని చూసిన సీఎం వి.డి. సతీశన్ వెంటనే తన కాన్వాయ్‌ను నిలిపివేశారు. క్షతగాత్రుడికి తక్షణ వైద్యం అందించేందుకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా, తన భద్రతా పైలట్ వాహనంలోనే అతడిని ఆస్పత్రికి తరలించాలని అధికారులను ఆదేశించారు. సతీశన్ సమయానుకూలంగా స్పందించి చూపిన ఈ మానవతా దృక్పథం పట్ల స్థానికులు, ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.