కేరళలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండే పోలింగ్‌

కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం 6 గంటలకు తెరపడింది. మూడు వారాలకు పైగా హోరాహోరీగా సాగిన ప్రచారం ముగియడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఈనెల 9న జరిగే పోలింగ్‌పై కేంద్రీకృతమైంది. రాష్ట్రవ్యాప్తంగా 2.71 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును వెల్లడించనున్నారు. అధికార ఎల్డీఎఫ్ అభివృద్ధి నినాదాలతో, ప్రతిపక్ష యూడీఎఫ్ ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందనే ధీమాతో, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తమ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. సీఎం పినరయి విజయన్ వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ఆశిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్