కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. తాజాగా ఈ కేసుకు సంబంధించిన నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరిని పుణేలోని లోహగడ్ ఫోర్ట్‌కు వేర్వేరుగా తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. కొండపైన ఘటనా స్థలిలో ఏం చేశారనేది నిందితుల నుంచి ఆరా తీశారు. ఇందుకోసం కేతన్ ప్లేసులో ఓ డమ్మీ బొమ్మను ఉంచి, కొండపై నుంచి తోశారు. కేతన్‌ను చంపడానికి ముందు నిందితులు రిహార్సల్స్ చేశారని, జూన్ 14న చేసిన ప్రయత్నం విఫలమైందని దర్యాప్తులో తేలింది.