కేతన్ హత్య కేసు.. లోహగఢ్ కోటకు పెరిగిన టూరిస్టులు!

మహారాష్ట్రలోని లోహగఢ్ కోటలో పుణెకు చెందిన బిజినెస్‌మెన్ కేతన్ అగర్వాల్ హత్యకు గురైన విషయం తెలిసిందే. కాబోయే భర్త కేతన్‌ను సియా తన ప్రియుడితో కలిసి లోయలోకి తోసేసి చంపేసిందని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో లోహగఢ్ కోటకు పర్యాటకుల రద్దీ పెరిగింది. టూరిస్టుల సంఖ్య దాదాపు 50 శాతం పెరిగిందని, ‘సియా గోయల్ పాయింట్’ ఎక్కడ ఉందో చూపించమని అడుగుతున్నారని కోట నిర్వాహకులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్