ఇరాన్‌లోని భారతీయులకు కేంద్రం కీలక హెచ్చరిక!

ఇరాన్‌లోని భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక అడ్వైజరీ జారీచేసింది. రాబోయే 48 గంటల పాటు భారతీయులు తాము ఉన్నచోటనే ఉండాలని, బయటకు రావద్దని సూచించింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, విద్యుత్, సైనిక స్థావరాలు, బహుళ అంతస్తుల భవనాలకు దూరంగా ఉండాలని పేర్కొంది. హర్మూజ్ జల సంధి తెరవాలని ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన 48 గంటల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈ అడ్వైజరీ వచ్చింది. అత్యవసర సహాయం కోసం ఫోన్ నెంబర్లను సంప్రదించాలని తెలిపింది. .

సంబంధిత పోస్ట్