నేడు CJP భవిష్యత్ కార్యాచరణపై కీలక ప్రకటన.. దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ

పరీక్షల పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేడు (గురువారం) తన భవిష్యత్ కార్యాచరణపై కీలక ప్రకటన చేయనుంది. ఈ నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మహారాష్ట్రలో జరిగిన వ్యూహాత్మక సమావేశాల అనంతరం దేశవ్యాప్త విస్తరణ, విద్యార్థి సంఘాలతో అనుసంధానం, విద్యా సంస్కరణల కోసం చేపట్టనున్న కార్యక్రమాలను వెల్లడించనున్నట్లు ప్రతినిధులు తెలిపారు. అయితే రాజకీయ పార్టీగా మారే ఆలోచన లేదని, విద్యా వ్యవస్థలో పారదర్శకత, పేపర్ లీకుల నివారణ, విద్యార్థుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యాలని సీజేపీ స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్