నీట్ పీజీ, నీట్ సూపర్ స్పెషాలిటీ ప్రవేశాల విధానంలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కీలక మార్పులు తీసుకురానుంది. ఇప్పటివరకు అమలులో ఉన్న పర్సంటైల్ విధానాన్ని రద్దు చేసి, ఇకపై ర్యాంకుల ఆధారంగానే మెరిట్ జాబితాను రూపొందించాలని నిర్ణయించారు. మంగళవారం సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో 12 మంది సభ్యుల నిపుణుల కమిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. కొత్త నిబంధనల రూపకల్పనపై ఎన్ఎంసీ కసరత్తు చేస్తోందని పేర్కొంది. కొత్త విధానం అమల్లోకి వస్తే ఫలితాల్లో పర్సంటైల్ మార్కులు ఉండవు, కేవలం ర్యాంకులు మాత్రమే ఉంటాయి.