బ్యాంకుల్లో రేపటి నుంచి కీలక మార్పులు.. IMPS, క్రెడిట్ కార్డులపై కొత్త నిబంధనలు

ఫిబ్రవరి 1 నుంచి SBI, ICICI, HDFC, PNB లలో కస్టమర్ల ఆర్థిక కార్యకలాపాల్లో పలు మార్పులు రానున్నాయి. SBI ఫిబ్రవరి 15 నుంచి IMPS లావాదేవీలపై కొత్త ఛార్జీలను అమలు చేస్తోంది. ICICI బ్యాంక్ కొన్ని క్రెడిట్ కార్డులపై ఫిబ్రవరి 1 నుంచి ఉచిత సినిమా టికెట్ ఆఫర్‌ను నిలిపివేస్తోంది. HDFC బ్యాంక్ ఇన్ఫినియా మెటల్ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లను నెలకు గరిష్టంగా 5 సార్లు మాత్రమే రీడీమ్ చేసుకునేలా నిబంధనలు మార్చింది. PNB కస్టమర్లు ఫిబ్రవరి 2 లోగా KYC అప్‌డేట్ చేసుకోవాలి. లేదంటే ఖాతా కార్యకలాపాలు నిలిచిపోతాయి.

సంబంధిత పోస్ట్