కేంద్రం కీలక నిర్ణయం.. MRP తగ్గింపుపై కీలక ఆదేశాలు

పండుగ సీజన్‌ వేళ వంటనూనెల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముడి పొద్దుతిరుగుడు నూనెపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని 10 శాతం నుంచి సున్నాకు, ముడి సోయాబీన్‌, పామాయిల్‌పై 10 నుంచి 5 శాతానికి తగ్గించింది. శుద్ధి చేసిన నూనెలపైనా సుంకాలను తగ్గించింది. సెప్టెంబర్‌ 24 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. తగ్గిన దిగుమతి వ్యయ ప్రయోజనాలను వినియోగదారులకు అందేలా వంటనూనె పరిశ్రమలు వెంటనే PTD, MRPలను సవరించాలని కేంద్రం సూచించింది.

సంబంధిత పోస్ట్

✕
✕