టెస్టు సిరీస్‌ నుంచి కీలక ప్లేయర్‌ అవుట్‌!

టీమిండియాతో ఆగష్టులో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు శ్రీలంక స్టార్‌ బ్యాటర్‌ పాతుమ్‌ నిసాంక దూరమయ్యే అవకాశాలున్నాయి. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో మణికట్టు గాయానికి గురైన నిసాంక, శస్త్ర చికిత్స కోసం యూకే వెళ్లినట్లు సమాచారం. దీంతో లంక ప్రీమియర్‌ లీగ్‌తో పాటు టీమిండియాతో సిరీస్‌కు కూడా అతడు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. గతేడాది కాలంగా టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్న నిసాంక, 2025లో 56 సగటుతో 393 పరుగులు చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్