సిద్దిపేట జిల్లా సిద్దిపేట గ్రామీణ మండలం రాఘవాపూర్లోని కేజీబీవీలో విద్యార్థిని ఒకరు తీవ్రమైన కడుపునొప్పితో మృతిచెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ మృతురాలి బంధువులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విద్యార్థిని మృతికి పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బంది, ఏఎన్ఎం నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.