TG: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఈ నెల 25న (శుక్రవారం) జరగనుంది. 24న షెడ్డు, బారికేడ్ల తొలగింపు నేపథ్యంలో, 23వ తేదీ (బుధవారం) రాత్రి వరకే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని గణేశ్ ఉత్సవ కమిటీ తెలిపింది. 25న ఉదయం 6 గంటలకు వినాయకుడిని భారీ టస్కర్పైకి ఎక్కించి, మధ్యాహ్నం 12 గంటల లోపు శోభాయాత్ర, నిమజ్జనం పూర్తి చేయాలని ప్రణాళిక చేస్తున్నారు.