ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం పదవికి రాజీనామా?

TG: గ్రేటర్ HYDలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన దానం కాంగ్రెస్ పార్టీలో చేరగా.. BRS ఆయన శాసనసభ్యత్వాన్ని రద్ధు చేయాలని సుప్రీంను ఆశ్రయించింది. ఈ కేసులో త్వరలో తీర్పు రానున్న నేపథ్యంలో కోర్టు తన శాసనసభ్యత్వాన్ని రద్ధు చేస్తూ ఆదేశాలు ఇవ్వకముందే పదవికి రాజీనామా చేయాలనే ఆలోచనతో దానం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్